Sunday, October 18, 2009

Centenary Photos


మన ఫంక్షన్ ఫొటోస్ చూడడానికి క్రింది లింక్స్ ని క్లిక్ చెయ్యండి...
తాతగారి శతజయంతి వేడుకల చిత్ర మాలిక...
విందులు.. వినోదాలు...

Tuesday, October 13, 2009

తాతగారి గురించి బేబీ అత్తా, మామయ్యగారూ రాసిన ఆర్టికల్స్ :


రచన:
భమిడిమఱ్ఱి వేంకట సత్యనారాయణ మూర్తి,
హైదరాబాదు. తేది: ౧౦.౧౦.౨౦౦౯ (10.10.2009)
******
-: ఓం :-
ప్రార్థన
ఉ. శ్రీ గిరిజాశ్చ వాణియును శ్రీయుతులందరు విఘ్నరాజుతోన్
ఈగదె సర్వసౌఖ్యములు యీ తెలగాణ్య సమాఖ్యకంతకున్
వేగమె వృద్ధి చెందుటకు, భేదము లేక సమాజసేవయున్
చేగల శక్తి నొందుటకు, చేసెద భక్తితో నేను విన్నపం
*****
కీ. శే. రుద్రావఝల నరసింహమూర్తి గారికి గౌరవాభివందనాలతో...
*****
సీ. భవుని స్తుతిపటిమ పరిఢవిల్లిన వంశ
పుణ్య ఫలమనగ పుట్టినారు,
సింహాచల క్షేత్ర చందన దైవంబు
నామమే మీకు మీ నాన్నగార్కి,
లింగమ్మగారు తల్లి యగుట చేతనే
హరిహర రూపాలు అవియె ఒకటి,
ఉత్తరాంధ్ర సీమ జ్యోతియై వెల్గెడు
విజయనగరము తావి గల మీరు

ఆ.వె. ఖద్దరు ధరియించి గాంధియైనారు ద
యాలు బాగు గురువు అట్లె గలరు
అన్ని తెరగుల కన మనసు వెన్నయే గద,
మానవతయే మీది మతము చూడ.

సీ. కౌమార ప్రాయాన కష్టాలు నిండంగ
ధీశక్తి తోడనే ఎదిరి నిలిచె,
ప్రౌఢ కాలములోన ప్రభుతను సేవించి
దేశ పురోగతి దిటవు జేసె ,
సేవా నివృతి చేసిన తదుపరి
సంఘ సేవయే మీకు స్వంతమయ్యె
వీరువారని కాదు వెతలు దీరినవారు
ఎందఱో వున్నారు ఇందుచోట

తే.గీ. మీ శతజయంతి సమయాన ఎదలు పొంగ
దారని లేరను నిజాము దాచలేక
మీరు పెంచిన సంఘపు మేలు కొఱకు
కలసి కృషి సల్పెదము కడలి రండు

ఆ.వె. తమరి ధర్మ పత్ని దాక్షాయణి యనగ,
బిడ్డలందరు మరి పితృ భక్తి
తత్పరులయి, తనయ నా క
ళత్రమగుట ' లక్కు' నాదే చూడ

. వె. నారసింహ మూర్తి నామము స్థిరమగు
బంధు మిత్రులందు పరులయందు,
వారి వంశమెల్ల వృద్ది పొందగలదు
భమిడిమఱ్ఱి మూర్తి పలుకు నిజము

Monday, October 12, 2009

శ్రద్ధాంజలి...


తాతగారితో
అనుభవాలను మనతో పంచుకుంటున్న రామకృష్ణారావు పెదనాన్నగారు
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

Monday, June 15, 2009

తాతగారి శత జయంతి...

లేటు శ్రీ రుద్రావఝల నరసింహ మూర్తిగారు... ౧౯౦౯-౨౦౦౯ (1909 - 2009)... క్లుప్తంగా ఆర్. ఎన్. మూర్తి గారు.... తెలగాణ్య అభ్యుదయ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు... మా తాతగారు...వారి శత జయంతి 2009 కృష్ణాష్టమి నాటికి ౧౦౦ ఏళ్ళు (100 yrs) పూర్తి అవుతున్న సందర్భాన .. వారి పిల్లలు.. మనుమలు.. మునిమనుమలు.. . ఎక్కడెక్కడో వున్న వారి సంతతి అంతా కలిసి ఒక్కచోట చేరడం... తాతగార్నితలచుకోవడం... అందరూ కలసి ఆపాతమథురాలని నెమరువేసుకోవడం... విందులూ... వినోదాలూ.. గానాబజానాలూ... అంతా ఒహటే హడావిడి...
ఇప్పటికే మీకు ఉత్సాహం ఉరకలు వేస్తోందా... ఎక్కడో... ఎప్పుడో.. ఏమీ తెలుసుకోకండానే... అదేమరి... ఆఁ...ఆఁ... ఆట్టే...ఆట్టే... మీరు కుదురుగా వుంటేగాని చెప్పనంథే... హన్నా...
ఆఁ... అదీ... ఇప్పుడు చెప్తా వినండి... ఆగష్టు 14, 15వ తారీకులలో... విశాఖపట్నం పెదవాల్తేరు లో... చేసుకుంటున్నాం ... అంచేతా... మనమంతా... ఆగష్టు 14 పొద్దున్న 6:00 am కల్లా ఒళుపొచ్చీసి ఫంక్షన్ ని జయప్రదం చేస్తారని తలుస్తాము...
ఇట్లు...
ఇంకెవరు...
.....మనమే...
మనందరమూనూ...