రచన:
భమిడిమఱ్ఱి వేంకట సత్యనారాయణ మూర్తి,
హైదరాబాదు. తేది: ౧౦.౧౦.౨౦౦౯ (10.10.2009)
******
-: ఓం :-
ప్రార్థన
ఉ. శ్రీ గిరిజాశ్చ వాణియును శ్రీయుతులందరు విఘ్నరాజుతోన్
ఈగదె సర్వసౌఖ్యములు యీ తెలగాణ్య సమాఖ్యకంతకున్
వేగమె వృద్ధి చెందుటకు, భేదము లేక సమాజసేవయున్
చేగల శక్తి నొందుటకు, చేసెద భక్తితో నేను విన్నపం
*****
కీ. శే. రుద్రావఝల నరసింహమూర్తి గారికి గౌరవాభివందనాలతో...
*****
సీ. భవుని స్తుతిపటిమ పరిఢవిల్లిన వంశ
పుణ్య ఫలమనగ పుట్టినారు,
సింహాచల క్షేత్ర చందన దైవంబు
నామమే మీకు మీ నాన్నగార్కి,
లింగమ్మగారు తల్లి యగుట చేతనే
హరిహర రూపాలు అవియె ఒకటి,
ఉత్తరాంధ్ర సీమ జ్యోతియై వెల్గెడు
విజయనగరము తావి గల మీరు
ఆ.వె. ఖద్దరు ధరియించి గాంధియైనారు ద
యాలు బాగు గురువు అట్లె గలరు
అన్ని తెరగుల కన మనసు వెన్నయే గద,
మానవతయే మీది మతము చూడ.
సీ. కౌమార ప్రాయాన కష్టాలు నిండంగ
ధీశక్తి తోడనే ఎదిరి నిలిచె,
ప్రౌఢ కాలములోన ప్రభుతను సేవించి
దేశ పురోగతి దిటవు జేసె ,
సేవా నివృతి చేసిన తదుపరి
సంఘ సేవయే మీకు స్వంతమయ్యె
వీరువారని కాదు వెతలు దీరినవారు
ఎందఱో వున్నారు ఇందుచోట
తే.గీ. మీ శతజయంతి సమయాన ఎదలు పొంగ
దారని లేరను నిజాము దాచలేక
మీరు పెంచిన సంఘపు మేలు కొఱకు
కలసి కృషి సల్పెదము కడలి రండు
ఆ.వె. తమరి ధర్మ పత్ని దాక్షాయణి యనగ,
బిడ్డలందరు మరి పితృ భక్తి
తత్పరులయి, తనయ నా క
ళత్రమగుట ' లక్కు' నాదే చూడ
ఆ. వె. నారసింహ మూర్తి నామము స్థిరమగు
బంధు మిత్రులందు పరులయందు,
వారి వంశమెల్ల వృద్ది పొందగలదు
భమిడిమఱ్ఱి మూర్తి పలుకు నిజము
nice blog ! thanks forsharing the post
ReplyDeleteTrendingandhra
Nice article thanks for sharing
ReplyDeleteOnline Breaking News Telugu
Telugu Latest Telangana Districts News